బిజినెస్‌ ఐడియా : మెడికల్‌ షాప్‌ పెట్టండి.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది..!

-

మీరు బిజినెస్‌ పెట్టే ఆలోచనలో ఉంటే..మెడికల్ షాప్‌ బిజినెస్‌ వైపు ఒకసారి చూడండి. సబ్సిడీ ధరకే మెడిసిన్ అమ్మే మెడికల్ షాప్ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఈరోజుల్లో మందుల షాపుకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఇంటి దగ్గర్లో మెడికల్‌ షాపు ఉండాలని అందరూ అనుకుంటున్నారు. అందుకే వీధికి ఒకటి పుడుతుంది. అలా అని దీనికి గిరాకీ లేదునుకుంటారేమో.

ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి స్కీమ్ ద్వారా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తోంది. ఈ స్కీమ్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది. జన్ ఔషధి కేంద్రాల్లో మందులు బయటి మార్కెట్‌తో పోలిస్తే 50 శాతం నుంచి 90 శాతం తక్కువకే లభిస్తాయి. ప్రధాన మంత్రి మోదీ చెప్పినట్టు రూ.100 విలువైన మెడిసిన్స్‌ని కేవలం రూ.15 లోపే లభిస్తాయి. ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1800 పైగా మందులు, సర్జికల్ డివైజ్‌లు, న్యూట్రాసూటికల్, ఆయుష్ ప్రొడక్ట్స్, సువిధ శానిటరీ ప్యాడ్స్ జన్ ఔషధి కేంద్రాల్లో లభిస్తాయి. డీఫార్మసీ, ఫార్మాసీ పూర్తి చేసినవారు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు. స్వచ్ఛంద సంస్థలు జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు. డీఫార్మసీ, బీ ఫార్మాసీ చదివినవారిని ఉద్యోగులుగా నియమించాల్సి ఉంటుంది. ఎంఆర్‌పీ పైన 20 శాతం లాభం లభిస్తుంది.

జన్‌ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే..

జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కనీసం 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి. నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ.5,000 చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు, ఆర్థిక సహకారం ఇస్తుంది. ఫర్నీచర్, కంప్యూటర్, ప్రింటర్ లాంటివి కొనడానికి మహిళలకు, దివ్యాంగులకు, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి ఒకసారి ఆర్థిక సహకారం లభిస్తుంది. బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్‌యూస్ ఆఫ్ ఇండియా నుంచి రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహకారం లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించే సందర్భాల్లోనే ఈ ఆర్థిక సహకారం లభిస్తుంది. మెడిసిన్స్‌పై 20 శాతం వరకు మార్జిన్ లభిస్తుంది. ఈ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో కావాలి.

ముందుగా http://janaushadhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో APPLY FOR KENDRA ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. వివరాలన్నీ చదివిన తర్వాత Check Available Location పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా సెలెక్ట్ చేయాలి. మీరు ఎంచుకున్న ప్రాంతంలో జన్ ఔషధి కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే Click here to Apply పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news