ఈ బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయి…!

-

మహిళలు ఇలా చేస్తే డబ్బులని సంపాదించచ్చు. మహిళలు కలిసి పనిచేస్తూ సులభంగా మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కోసం ఈ బిజినెస్ ఐడియా. ఇప్పుడు ఫ్యాబ్రిక్ జ్యూట్ బ్యాగ్స్ (జనపనార బ్యాగ్స్)కు మంచి డిమాండ్ వుంది. కనుక దానిని స్టార్ట్ చెయ్యొచ్చు.

jute bags
jute bags

దీని కోసం ముఖ్యంగా ఫ్యాబ్రిక్ జ్యూట్ బ్యాగ్స్ తయారీకి ఒక యూనిట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పొందితే మంచిది. జ్యూట్ తో హాండ్ బ్యాగ్స్ ,సూట్ కేసులు , షాపింగ్ బ్యాగ్స్ మొదలైన వాటిని చెయ్యొచ్చు. వీటి మీద ఆప్టిక్ వర్క్ ,పెయింటింగ్ ప్రింట్లు డిజైన్ చేయించి వాడవచ్చు. జ్యూట్ బ్యాగ్ తయారీ కోసం జ్యూట్ ఫ్యాబ్రిక్ రోల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అలానే ఒక జ్యూట్ ఫ్యాబ్రిక్ రోల్ 1.2 మీటర్ల వెడల్పు తో 200 మీటర్లు వరకూ ఉంటుంది. ఒక జ్యూట్ ఫ్యాబ్రిక్ రోల్ తో ఒక రోల్ తో 400 బ్యాగ్స్ తయారుచేయవచ్చు. (19″x15″ సైజు). ఒక నెలకు 35 రోల్స్ చొప్పున వాడితే 15 వేల బ్యాగ్స్ తయారు చేయవచ్చు. ఒక మీటర్ జ్యూట్ ఫ్యాబ్రిక్ ఖరీదు రూ. 30 ఉంటుంది. ఇలా కొన్ని కొనాలి.

ఇక దీని కోసం మీరు ఫ్యాబ్రిక్ కటింగ్ మిషిన్, హెవీ డ్యూటీ స్యూయింగ్ మిషిన్, ఆర్డినరీ స్యూయింగ్ మిషిన్, బ్యాగ్ మీద ప్రింటింగ్ కసం స్టెన్సిల్ ఎక్విప్ మెంట్, 500 స్క్వేర్ ఫీట్ ఒక ఖాళీ ప్రదేశంలో యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే ముగ్గురు వర్కర్స్ నెలవారీ జీతానికి అవసరం అవుతారు.

ఇలా మొత్తం ఖర్చు అంత పొగ రూ.1,55,000 నెలకు మిగిలే చాన్స్ ఉంది. క్లాత్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నుంచి బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే మంచిగా బిజినెస్ అవుతుంది. అలాగే సూపర్ మార్కెట్స్ లో కూడా ప్లాస్టిక్ బ్యాన్ కారణంగా జ్యూట్ బ్యాగ్స్ డిమాండ్ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news