పెరిగిన పెట్రోల్ ధరలు, వంటింటి గ్యాస్ ధరలు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే, కొన్ని చిన్నపాటి వెసలుబాటులను, క్యాష్‌బ్యాక్‌లను ఇటువంటప్పుడే కదా వాడుకోవాలి. మీరు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే గ్యాస్‌పై మీకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇక ఏమాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకండి. గ్యాస్ సిలిండర్‌ను రూ.50 డిస్కౌంట్‌కే కొనవచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.871.50. అదే అమెజాన్ లో మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అందులోని సమాచారం మేరకు మీరు సిలిండర్ బుక్ చేస్తే రూ.50 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.821.5 విలువైన సిలిండర్‌ను రూ.771 ధరకే కొనొచ్చు. రూ.50 డిస్కౌంట్ పొందొచ్చు.
అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత amazonpay పై క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తే booking lpg gas cylinder అనే బ్యానర్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. మీ గ్యాస్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఎల్‌పీజీ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. booking details పైన క్లిక్ చేయాలి. కస్టమర్ పేరు, బిల్ వివరాలు కనిపిస్తాయి. paynow పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి. అమెజాన్ లో సిలిండర్ బుక్ చేసిన తర్వాత రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొదటిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసినవారికే రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్‌కు సంబంధించిన నియమనిబంధనలు అమెజాన్ యాప్‌లో ఉంటాయి. ఈ వివరాలను చదివిన తర్వాతే బుకింగ్ చేయాలి.