గోదారి కుర్రోళ్ళా మజాకా..ఉద్యోగాలు వదిలేసి గాడిదల పెంపకం..లాభం లక్షల్లోనే..!!

-

చదువుకోకపోతే గాడిదల కాస్తావా అని చిన్నప్పుడు పెద్దోళ్లు అనేవారు.. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్లే గాడిదల కాసేందుకు ఉద్యోగాలు వదిలేసి మరీ వస్తున్నారు. ఏ జాబ్‌ చేస్తే ఇంత సంపాదన వస్తుంది అనుకోని ఈ బిజినెస్‌లో దిగుతున్నారు. అవును..ప్రస్తుతం గాడిద పాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లు వదిలేసి మరీ యువత ఈ వ్యాపారం వైపు అడుగులేస్తున్నారు. మీకు వ్యాపారం చేసే ఆలోచన ఉంటే.. ఈ రియల్‌ స్టోరీపై ఓ లుక్కేయండి..!

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ “అక్షయ డాంకి ఫామ్” పేరుతో సుమారు 115 విభిన్న జాతుల గాడిదలతో ఫామ్ ప్రారంభించారు. ఏకంగా సుమారు 10 ఎకరాల భూమిని తీసుకుని వాటికి అనువుగా దాణా, ఆరోగ్య సంబంధించిన మందులతో సాప్ట్ వేర్ ఇంజనీర్ తన మిత్రులతో కలసి గాడిదల ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.

రాజమండ్రికి చెందిన నరాల వీర వెంకట కిరణ్ కుమార్ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అతని మైండ్ సెట్ ను మార్చాయి. కరోనా సమయంలో బాడీ లోని ఇమ్మ్యూనిటి సిస్టమ్ కోసం గాడిద పాలను తీసుకోమని వైద్యులు తనకు చెప్పారని, వాటి ధర సుమారు లీటర్ 7వేలు పైగా ఉండడంతో నేటి

పాడి పరిశ్రమ రంగంలో గాడిద పాలకు మంచి డిమాండ్ఉం డడంతో తాను వృత్తిరిత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ తన నలుగురు ఆప్త మిత్రులతో కలసి ఆరునెలలు గాడిదల జీవన విధానం, వాటి ఆరోగ్యం, దాణా.. వాటికి అనువైన ప్రదేశాల గురించి కర్నాటకలో గాడిదల కోసం శిక్షణా పూర్తి చేసుకున్నారు. అనంతరం ఈ ఫార్మ్‌ను ఏర్పాటు చేశమని నిర్వాహకుల్లో ఒకరైన వెంకట్ అన్నారు.

ఇందుకోసం టోక్యో బిడ్స్, గుజరాత్ హలారి బిడ్స్, మహారాష్ట్ర కాత్వాడి బ్రిడ్స్ ,ఇతోఫియ ఫారిన్ కంట్రీ బ్రీడ్స్‌ను ఎంచుకున్నామని, వాటి విలువ కనీసం సుమారు యాబై వేల నుండి మూడు లక్షల వరకు ఉందని నిర్వాహకులు తెలిపారు. వీటి పాల ఉపయోగం ఇతర దేశాల్లో.. రాష్ట్రాల్లో అధికంగా ఉందని.. దీంతో గాడిద పాలు లీటర్ 7 వేలు నుంచి ఉందని అంటున్నారు. అంతేకాదు తాము సాఫ్ట్వేర్ రంగాన్ని మించిన ఆదాయం ఇక్కడే సొంత ఊరులో సంపాదించి నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తామని తెలిపారు.

ఈ గాడిద పాలను హైదరాబాద్, బెంగుళూరు ప్రాంతాలకు రోజుకు 25 లీటర్ల వరకు కూలింగ్ కంటైనర్ ద్వారా తీసుకెళ్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
తాము ఈ పాలను అందరికీ తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో గాడిదల ఫామ్‌ను ఏర్పాటు చేశామని నిర్వాహకురాల్లో ఒకరయిన భారతి అన్నారు. గాడిద పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని.. ముఖ్యంగా ఉబ్బసం వంటి వ్యాధులకు బాగా పనిచేస్తుందని. అలాగే గాడిద పాలల్లో ముసలితనం ఛాయలు దరిచేరవని తెలిపారు.

గాడిద పాలతో స్నానం చేస్తే ముసలినతం పోతుందని తెలిపారు.హైదరాబాద్ బ్యూటీ పార్లర్లో గాడిదపాలతో స్నానం చేయిస్తే 30 వేలకు పైగా తీసుకుంటారని చెప్తున్నారు. ఇప్పటికే మా అక్షయ డాంకి ఫామ్‌తో 20కి పైగా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని.. గాడిద పాలను బ్యూటీ టిప్స్‌తో పాటు పలు రకాల సబ్బులు, క్రీమ్స్ తయారీ సంస్థలకు విక్రయిస్తున్నామని నిర్వాహకులు భారతీ వెల్లడించారు.

గాడిద పాలకు ఉన్న డిమాండ్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఆయుర్వేదంలో గాడిద పాలను ఎక్కువగా వాడుతారను ఈ యుంగర్స్ గుర్తించారు. నేరుగా పాలను తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనీ..ఈ డిమాండ్‌ను గుర్తించి రాజానగరం మళ్ళంపుడిలో దాదాపు 120కి పైగా గాడిడలతో..వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా లాభాల్లో సాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news