ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో వ్యాపారాలు చేయడానికి ఇష్ట పడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం తో మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. దీనిని మీరు ఫాలో అయితే దినేష్ భాగద్ లాగే మీరు కూడా లక్షల లాభాలను సంపాదించవచ్చు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ బిజినెస్ ఐడియా గురించి చూద్దాం.
మధ్యప్రదేశ్ కి చెందిన దినేష్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవారు ఇప్పుడు మాత్రం థాయ్ జామను పండిస్తూ సంవత్సరానికి 32 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన పొలం లో ఎటు చూసినా కిలోలు బరువు ఉండే పెద్ద పెద్ద జామ కాయలు వేలాడుతూ ఉంటాయి. నాలుగు ఎకరాల పొలం లో కూరగాయలు పండించే వారు. కానీ వీటి వల్ల ఎక్కువ నష్టాలు వచ్చేవి.
కూరగాయల పెంపకం కి ఎరువులు వాడటం, కూలీల ఖర్చు ఇలా చాలా పెట్టుబడి పెట్టాలి. రాబడి తక్కువగా వస్తోంది. అందుకనే ఏదైనా మంచి లాభాలను పొందే పంట వేయాలి అనుకున్నారు. ఒక రోజు థాయ్ జామని పండిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని.. దానిని మొదలు పెట్టారు. సేంద్రియ పద్ధతులని పాటిస్తే పండుగకి పరిణామం ఎక్కువగా ఉంటుందని అదే పద్ధతిని కొనసాగించారు.
మొదట మొక్కలు నాటిన 11 నెలల తర్వాత పంట చేతికి వచ్చింది. ఒక పండు బరువు 1.2 కిలోల వరకు ఉంటుంది. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉండడంతో లాభాలు కూడా బాగా వస్తున్నాయి. 18 ఎకరాల్లో నాలుగు వేల చెట్లను పెంచుతున్నారు. ఆదాయం కూడా ఐదు రెట్లు పెరిగింది జామ రుచి బాగుండటం భారీగా ఉండడంతో అందర్నీ బాగా ఆకర్షిస్తోంది. జైపూర్, ఉదయపూర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, పూణే, ముంబై, బెంగళూరు ఇలా భారతదేశంలో చాలా ప్రాంతాలలో అమ్ముతున్నారు. ప్రస్తుతం దినేష్ సంవత్సరానికి 32 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాగే మీరు కూడా థాయ్ జామను పండిస్తే లక్షల్లో లాభాలను పొందవచ్చు.