బిజినెస్ ఐడియా: రూ.5 లక్షలు పెడితే…. నెలకు రూ.70 వేలు సంపాదించొచ్చు!

-

మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే తప్పకుండ మీరు దీనిని చూడాలి. దీనితో మీరు మంచిగా సంపాదించొచ్చు. అయితే అది అసలు ఏ బిజినెస్..?, ఎలా డబ్బులు వస్తాయి..? వంటివి ఇప్పుడు చూసేయండి. పూర్తి వివరాల లోకి వెళితే …. ఇది డెయిరీ బిజినెస్. ఇది చేయడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. పైగా ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. అయితే దీనిలో లాభాలు బాగున్నా కొంత నష్టం కూడా అదే స్థాయిలో ఉండొచ్చని తెలుసుకోండి.

కేవలం రూ.5 లక్షలు మీ చేతి నుండి పెట్టుకుంటే చాలు. నెలకు రూ.70 వేల వరకు సంపాదించొచ్చు. మీరు ఈ వ్యాపారం చేద్దామని ఫిక్స్ అయితే ముద్రా లోన్ స్కీమ్ కింద బ్యాంక్ నుంచి లోన్ పొందొచ్చు. ఏకంగా మీకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయ్యే ఖర్చులో 70 శాతం ముద్రా స్కీమ్ కింద రుణం రూపం లో పొందొచ్చు. అదిరిపోయింది కదా ఇది. దీనితో మీకు డబ్బు సమస్య ఉండదు. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ప్రాజెక్ట్ ప్రకారం వ్యాపారం ప్రారంభించడానికి రూ.16 లక్షల దాకా ఖర్చవుతుంది. అయితే మీరు ఐదు లక్షలని కనుక పెట్టుకుంటే మిగతా మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు.

దీనితో మీరు సూపర్ బిజినెస్ ని స్టార్ట్ చేసేయొచ్చు. 75 వేల లీటర్ల పాలను, 36 వేల లీటర్ల పెరుగు, 90 వేల లీటర్ల మజ్జిగ, 4500 కేజీల నెయ్యిని కూడా విక్రయించొచ్చు. ఈ వ్యాపారం లో ఏడాదికి రూ.74 లక్షల దాకా వస్తాయి. ఖర్చులు పోగా రూ.8 లక్షల దాకా మిగులుతాయి. ఇది ఇలా ఉండగా ప్రాసెసింగ్ ఏరియా, రిఫ్రిజిరేషన్ రూమ్ వంటి వాటి కోసం 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి గుర్తుంచుకోండి.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news