వేల కోట్ల డీల్ కుదుర్చుకున్న టీసీఎస్

-

దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మెగా డీల్ కుదుర్చుకుంది. టాటామోటార్స్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తో మెగా డీల్ ని గెలుచుకున్నట్టు ప్రకటించింది. భవిష్య డిజిటల్ సేవల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది. 

జేఎల్ఆర్ తో రానున్న ఐదేళ్లకు రూ.8,300 కోట్ల కొత్త భాగస్వామ్య డీల్ జరిగినట్టు టీసీఎస్ స్టాక్ ఎక్సైంజ్ ఫైలింగ్ లో తెలిపింది. కొత్త భవిష్యత్ సిద్ధమైన వ్యూహాత్మక సాంకేతిక నిర్మాణాన్ని రూపొందించే క్రమంలో ఈ డీల్ రీఇమాజిన్ వ్యూహానికి మద్దతు ఇస్తుందని పేర్కొంది. టీసీఎస్ సేవల్లో అప్లికేషన్ డెవలప్ మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఎంటర్ ప్రైజ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్, క్లౌడ్ మైగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సర్వీసెస్ లాంటివి ఉన్నాయి. ఈ డీల్ పై ఇద్దరూ సంస్థలు సంతోషాన్ని ప్రకటించాయి. అనిశ్చిత డిమాండ్ వాతావరణం కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు లేక ఐటీ మేజర్ లు అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో టీసీఎస్ ఐరోపాలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో గెలిచిన ఆరో ప్రధాన ఒప్పందం కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news