ఈ శతాబ్దపు అతిపెద్ద విజయం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం : నిరంజన్ రెడ్డి

-

ఈనెల 16వ తేదీన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్ రన్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి పథకం గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయంగా ఈ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకమని పేర్కొన్నారు.

‘పరాయి పాలన ఒక శాపం.. స్వపరిపాలన ఒక వరం. 2015 జూన్‌ 11న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన సంధర్భంగా భూత్పూర్ బహిరంగసభలో కేసీఆర్ ఒకటే మాట చెప్పారు.. హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా.. కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తానని కేసీఆర్ అన్నారు. పాలమూరు రైతుల కాళ్లను కృష్ణానది నీళ్లతో కడుగుతా అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లి రాజ్యాంగబద్ధంగా పాలమూరు పథకానికి అనుమతులు సాధించార. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి నిర్మించుకుని కృష్ణా నీళ్లను మలుపుకుంటున్నాం’ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news