అద్దంకి సీటుపై డౌట్..తుంగతుర్తిలో ట్విస్ట్ ఉంటుందా?

-

గత రెండు ఎన్నికల్లో గెలుపు దగ్గరవరకు వచ్చి..దురదృష్టం కొద్ది ఓడిపోతున్న నేతల్లో అద్దంకి దయాకర్ కూడా ఒకరు. గత రెండు ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీల తేడాతో ఓడిపోతూ వచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తిలో పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి గాదరి కిషోర్ చేతుల్లో కేవలం 2379 ఓట్ల తేడాతో అద్దంకి ఓడిపోయారు.

ఇక 2018 ఎన్నికల్లో కూడా గెలుపు కోసం అద్దంకి గట్టిగానే పోరాడారు. కానీ చివరికి 1847 ఓట్ల తేడాతో అద్దంకి ఓడిపోయారు. ఇలా రెండు సార్లు స్వల్ప మెజారిటీలతోనే ఓడిపోయారు. అయితే 2018లో ఈ‌వి‌ఎంల్లో మోసం జరిగిందనే ఆరోపణలు చేశారు. కేసులు వేశారు. కానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో పోటీకి అద్దంకి రెడీ అయ్యారు. ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరతానని అంటున్నారు. అటు బి‌ఆర్‌ఎస్ నుంచి కిషోర్ మళ్ళీ పోటీ చేయడం ఖాయమైంది.

కానీ ఈ సారి బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే కిషోర్‌కు అంతగా పాజిటివ్ లేదు. ఈ నేపథ్యంలో అద్దంకికు గెలుపు అవకాశాలు కాస్త ఉన్నాయనే ప్రచారం వస్తుంది. కాకపోతే ఆయనకు సీటు విషయంలో ట్విస్ట్ ఉంది. ఎందుకంటే అద్దంకితో పాటు తుంగతుర్తి సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో సీటు అధిష్టానం తేల్చాల్సి ఉంది.

ఈ క్రమంలో సీటు తనకు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని, లేదంటే సీటు ఎవరికి ఇచ్చిన వారి గెలుపు కోసం కృషి చేస్తానని అద్దంకి చెప్పడంతో..తుంగతుర్తి సీటు విషయంలో క్లారిటీ లేదు. అంటే అద్దంకి సీటు దక్కుతుందో లేదో తెలియడం లేదు. చూడాలి మరి ఈ సారి దయాకర్ సీటు దక్కించుకుని తుంగతుర్తిలో గెలుస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news