విజయవాడలో రైలు భోగీ థీమ్‌తో రెస్టారెంట్‌.. అదిరిపోయిన ఇంటిరీయర్‌

-

విజయవాడలో ఫుడ్‌ లవర్స్‌ ఎక్కువగా ఉంటారు. అంటే విజయవాడలోనే ఉంటారా అంటారేమో.. ఇక్కడ భోజన ప్రియులకు ఒక స్పెషల్‌ ఉంటుంది. తినే ఐటమ్‌ మాత్రమే కాదు.. తినే ప్లేస్‌కు కూడా బాగా ప్రిఫరెన్స్‌ ఇస్తుంటారు. ఫ్లైట్‌ రెస్టారెంట్‌ను విజయవాడలో స్టాట్‌ చేసినప్పుడు అది మాములుగా హిట్‌ అవలేదు. విమానం ఎక్కాలనుకునే కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రెస్టారెంట్‌ బాగా అట్రాక్ట్‌ చేసింది. ఫ్లైట్‌లోనే ఉండి తిన్నట్లు మంచి అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు అదే తరహాలో ట్రైన్‌ రెస్టారెంట్‌ను లాంచ్‌ చేశారు. ఇది మరీ హైలెట్. భారతీయ రైల్వే (Indian Railways) పాత రైలు బోగీలను అత్యాధునిక హంగులతో రెస్టారెంట్‌గా తీర్చిదిద్ది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ల ఆవరణలో రైల్ కోచ్ రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌లో లేటెస్ట్‌గా రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రారంభమైంది.

విజయవాడ డివిజన్‌లో ఇది రెండో రైల్ కోచ్ రెస్టారెంట్ కావడం విశేషం. విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్, హల్దీరామ్స్ ఛైర్మన్ శివ్ కిషన్ జీ అగర్వాల్ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్‌ను హల్దీరామ్స్ సంస్థ నిర్వహిస్తుంది. స్లీపర్ కోచ్‌ను మాడిఫై చేసి ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇంటీరియర్ అయితే అద్భుతంగా ఉంది. ఇది ఏసీ రెస్టారెంట్. రైల్వే ప్రయాణికుల్ని, పర్యాటకుల్ని ఆకర్షించడం కోసం రైల్ కోచ్ రెస్టారెంట్ చేశారు. విజయవాడవాసులు కూడా ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ టేస్ట్ చేయొచ్చు.

సరికొత్త ప్రదేశంలో ఫుడ్ టేస్ట్ చేయాలనుకునే వారికి ఈ రెస్టారెంట్ బెస్ట్ ఆప్షన్. థీమ్ రెస్టారెంట్లు ఇష్టపడేవారిని రైల్ కోచ్ రెస్టారెంట్ బాగా ఆకర్షించనుంది. ఈ రెస్టారెంట్ 24 గంటల పాటు రైల్వే ప్రయాణికులకు, పర్యాటకులకు, విజయవాడవాసులకు అందుబాటులో ఉంటుంది. స్నాక్స్, స్వీట్స్ తయారు చేసే సంస్థ అయిన హల్దీరామ్స్ ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. అందుకే ఈ రెస్టారెంట్‌కు హల్దీరామ్స్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. గతంలో నాగ్‌పూర్‌లో కూడా హల్దీరామ్స్ సంస్థ రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

విజయవాడలో ప్రారంభించిన రైల్ కోచ్ రెస్టారెంట్‌లో సీటింగ్ కెపాసిటీ 110 వరకు ఉంది. అయితే రైలు లోపల 46 మంది కస్టమర్లు కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. కోచ్ బయట 64 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంది. ఈ రెస్టారెంట్‌లో 126 వెరైటీల ఫుడ్ ఐటెమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెస్టారెంట్ 24 గంటల పాటు తెరిచే ఉంటుంది. స్విగ్గీ, జొమాటో, ఐఆర్‌సీటీసీ కేటరింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. విజయవాడ డివిజన్‌లో మరో మూడు రైల్ కోచ్ రెస్టారెంట్లు అందుబాటులోకి రాబోతున్నాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version