మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే ఇది మీకు బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా ప్లాస్టిక్ నుండి అందరు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి మీకు బిజినెస్ కూడా బాగుంటుంది. పేపర్ కప్స్ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలు సాధించవచ్చు. పైగా చాల మంది వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. సింపుల్ గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు.
పైగా ముద్ర పథకం కింద పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తోంది. కాబట్టి ఆర్ధికంగా కూడా మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం కేంద్ర ప్రభుత్వమే డీపీఆర్ సిద్ధం చేసిన సంగతి కూడా తెలిసినదే. అయితే మరి ఈ బిజినెస్ వల్ల ఎంత లాభం వస్తుంది…?, ఎంత ఇన్వెస్ట్ చేయాలి..? ఇలా అనేక విషయాలు ఇప్పుడు చూద్దాం.
ముందుగా మీరు పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపారం స్టార్ట్ చెయ్యాలంటే 500 చదరపు అడుగుల స్థలం కావాలి గమనించండి. అలానే మనకి మిషన్లు అవసరం. ఇలా ఫర్నిచర్, ఇన్‌స్టాలేషన్, ప్రీ ఆఫరేటివ్ ఖర్చులు, మిషన్లకి రూ. 10.70 లక్షలు కావాలి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనిచేసే సిబ్బంది కావాలి. వాళ్లకి జీతాలు నెలకు రూ. 35వేలు.
అంతే కాకుండా ముడి సరుకుల కోసం రూ. 3.75 లక్షలు. యుటిలిటీ ఖర్చులు రూ. 6 వేలు. అలానే ఇతర ఖర్చులు ఒక 25 వేలు అవుతాయి. ఇక లాభం గురించి చూస్తే… 300 రోజులు పని చేస్తే.. 2.20 కోట్ల పేపర్ కప్‌లు ఉత్పత్తి చేయవచ్చు. ఒక్క కప్‌ను 30 పైసలకు అమ్ముకోవచ్చు.దీనితో మీకు సంవత్సరానికి 9 లక్షల ఆదాయం వస్తుంది. దీనితో మీకు 70 వేల నుంచి 80 వేలు నెలకి వస్తాయి. ముందు మీరు 25శాతం పెట్టుబడి పెడితే కేంద్రం 75 శాతాన్ని మీకు ఇస్తుంది.