సినిమాలంటే పాటలుంటాయి.. పాటల్లో డ్యాన్సులంటాయి.. డ్యాన్సంటే చిరంజీవే గుర్తుకు వస్తారు.. అంటూ అభిమానులు ఒకప్పుడు మురిసిపోయేవారు.
చిక్ చిక్ చేలం… చిక్ చిక్ చేలం.. పాటైనా.. అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూ.. పాటైనా.. ఏ పాటైనా సరే.. ఏ స్టెప్ అయినా సరే.. అవలీలగా చేసేయగల సత్తా మెగాస్టార్ చిరంజీవికి సొంతం. సినిమాలంటే పాటలుంటాయి.. పాటల్లో డ్యాన్సులంటాయి.. డ్యాన్సంటే చిరంజీవే గుర్తుకు వస్తారు.. అంటూ అభిమానులు ఒకప్పుడు మురిసిపోయేవారు. సినిమా హీరోలు చక్కగా డ్యాన్స్ చేయాలన్న ట్రెండ్‌ను సెట్ చేసింది.. చిరంజీవే అని చెప్పవచ్చు. ఇప్పటి యంగ్ హీరోల డ్యాన్స్‌కు చిరంజీవి డ్యాన్సే ప్రేరణ అని చెప్పవచ్చు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్యాన్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చిరంజీవే. తెరపై పాటలకు ఆయన స్టెప్పులు వేస్తుంటే అభిమానులు ఆ డ్యాన్స్‌ను చూస్తూ మైమరిచిపోతుంటారు. చిరు స్టెప్పులకు వారు మంత్రముగ్ధులు అవుతుంటారు. అసలు చిరంజీవికి అంతలా అభిమానులు ఏర్పడడానికి కారణం ఆయన చేసే డ్యాన్సే అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆయన తన సినిమాల్లో ఆయా పాటలకు చేసే డ్యాన్సులు కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా అప్పట్లో వచ్చిన ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మా.. పాటకు చిరంజీవి వేసిన వీణ స్టెప్‌ను ఇప్పటికీ అనేక మంది అనుకరిస్తుంటారు. అదీ.. చిరంజీవి డ్యాన్సులో ఉన్న మజా..!
చిరంజీవి ఇప్పటి వరకు చేసిన అనేక సినిమాల్లో నటనతోపాటు డ్యాన్సుకు కూడా అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాలోని నేనే ముఠామేస్త్రి.. అనే పాటలో ఎక్కడో నాలుగో వరుసలో అప్పట్లో డ్యాన్స్ చేసిన రాఘవ లారెన్స్ చిరంజీవి చలవ వల్లే ఇండస్ట్రీలో అంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయ్యాడని చెబుతుంటారు. అలాగే ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లను చిరంజీవి ఆదరిస్తారని అభిమానులు అంటారు. అందుకనే ఆయన పాటలకు స్టెప్పులు కట్టేందుకు డ్యాన్స్ మాస్టర్లు తహతహలాడుతుంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఇప్పటికీ.. డ్యాన్స్ విషయంలోనూ మెగా స్టారేనని చెప్పవచ్చు..!