దుమారం రేపుతున్న హైప‌ర్ ఆది కామెంట్లు.. నిర్మాత‌ను అలా అన్నాడేంటి!

ముంబ‌యిలో రైలు ప‌ట్టాల‌పై ప‌డ్డ బాబును కాపాడి దేశ వ్యాప్తంగా హీరో అయిన వ్య‌క్తి గుర్తున్నాడు క‌దా. ఇప్పుడు ఇదే వీడియో చుట్టూ టాలీవుడ్ లో ర‌చ్చ జ‌రుగుతోంది. అదేంటి దానికి టాలీవుడ్ కి ఏం సంబంధం ఉంది అంటారా.. ఉందండి. ఎలా అటే.. ఈ రైలు హీరోకు ఒక జావా బైక్ బ‌హుమ‌తిగా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే దీన్ని షేర్ చేస్తూ నిర్మాత పొట్లూరి వీర ప్ర‌సాద్ ఘాటు కామెంట్లు చేశాడు.

రియ‌ల్ హీరోకు జావాబైక్‌.. లంగా డ్యాన్సులేసే రీల్ హీరోల‌కు రూ.50 కోట్లా.. హ‌త‌విధీ అంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ భ‌గ్గుమ‌న్నారు. ఇక ఈ కామెంట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించే చేశార‌ని ఆగ్ర‌హం తెలుపుతున్నారు. వ‌కీల్ సాబ్ సినిమాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.50కోట్లు తీసుకున్నార‌నే టాక్ న‌డుస్త‌న్న టైమ్ లో ఈ కామెంట్లు వేడి పుట్టించాయి. ఇక మెగా హీరోలపై ఎవరైనా కామెంట్ చేస్తే.. హైపర్ ఆది వారిని బాగానే ఆడుకుంటాడు. పీవీపీపై హైపర్ ఆది కాస్త ఘాటుగానే కామెంట్లు చేశాడు ట్విట్ట‌ర్ లో.

నీలాంటి లంగా బాబులు కోట్లు ఉన్నా కబుర్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి కూడా సాయం చెయ్యరు అని రాసిన ఆది… పులిని చూసి నక్క వాత ట్టుకోవడం అంటే ఇదే అని కామెంట్ చేశాడు. అలాగే సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళన‌గా మాట్లాడుతున్న నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలి అంటూ ఓ రేంజ్ లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమార‌మే రేపుతోంది. ఒక నిర్మాత‌ను ఆ స్థాయిలో తిట్ట‌డం ఏంటి అంటూ సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇది ఇకెంత ర‌చ్చ‌గా మారుతుందో చూడాలి మ‌రి.