బెజవాడలో కొత్త దందా, కరోనా టెస్ట్ ఒక రోజులో రావాలంటే ఎంత కట్టాలంటే…?

విజయవాడలో కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు కొత్త దందా మొదలుపెట్టాయి. రిపోర్ట్ త్వరగా రావాలి అంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉదయం నుంచి టోకెన్ల కోసం బాధితులు ఎదురు చూస్తుంటే కరోనా భయాన్ని ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. విజయవాడ ఆస్పత్రులలో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని మీడియా గుర్తించింది.

చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే విజయవాడలో టెస్టింగ్ సెంటర్ లు ఉన్నాయి. 450 మందికి మాత్రమే ప్రభుత్వ టెస్టింగ్ సెంటర్ లు టోకెన్ లు ఇస్తున్నారు. 24 గంటల్లో రిపోర్ట్ రావాలంటే 1500 ఇవ్వాలి. రెండు రోజుల్లో రావాలి అంటే 1000, నాలుగు రోజులు అయితే 500 ఇవ్వాలని కండీషన్ పెడుతున్నారు.