ఈ వారం థియేటర్‌లో ఆసక్తికర మూవీస్‌ ఇవే

-

ఏప్రిల్‌ చివరి వారం కూడా వచ్చేసింది. సినిమా ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. గత నాలుగు వారాలు చిన్న సినిమాలే సందడి చేశాయి. ఈసారి మాత్రం ఇంట్రెస్టింగ్ చిత్రాలు వస్తున్నాయి. మరి ఈ వారం వస్తున్న సినిమాల సంగతేంటో ఓసారి చూద్దామా..?

నారా రోహిత్‌ హీరోగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’. సిరి లెల్లా కథానాయిక. ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రతినిధి’ సిరీస్‌ నుంచి వస్తున్న రెండో ఫ్రాంచైజీ ఇది. ఇందులో నారా రోహిత్‌ నిజాయతీ గల న్యూస్‌ రిపోర్టర్‌ పాత్రలో కనిపించనున్నారు.విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రత్నం’ .. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భరణి’, ‘పూజ’ తర్వాత విశాల్‌-హరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రుస్లాన్’ . జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version