బన్నితో త్రివిక్రం ముహుర్తం ఫిక్స్

-

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ తన తర్వాత సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కొన్నాళ్లు విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లదని తేలింది. ఇక అరవింద సమేత తర్వాత త్రివిక్రం ఎలాగు ఖాళీ అయ్యాడు. అతనితోనే బన్ని సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. డిసెంబర్ లో ఏకంగా ఈ సినిమా ముహుర్తం కూడా పెట్టేశారని తెలుస్తుంది.

డిసెంబర్ 11న త్రివిక్రం, బన్ని సినిమా మొదలు పెడుతున్నారట. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. కచ్చితంగా ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలుంటాయి. సరైనోడుతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన బన్ని డిజేతో సినిమాలో స్టఫ్ లేకున్నా తన క్రేజ్ మీద ఆడించాడు. మరి అరవింద తర్వాత త్రివిక్రం బన్నితో ఎలాంటి సినిమా చేస్తాడో ప్రస్తుతానికి అయితే సస్పెన్సే.

Read more RELATED
Recommended to you

Exit mobile version