లిప్ లాక్ వల్ల హీరో కాపురంలో నిప్పులు

-

టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ గా వస్తున్న లిప్ లాక్స్ బాలీవుడ్ లో ఎప్పుడో ట్రెండ్ సెట్ చేశాయి. దశాబ్ధ కాలం నుండి అక్కడ సినిమాల్లో లిప్ లాక్స్ చాలా కామన్ అయ్యాయి. హీరో, హీరోయిన్ అదరచుంభనం సినిమాకు అదనపు ఆకర్షణ అనే సూత్రం బీ టౌన్ ఫిల్మ్ మేకర్స్ ముందే కనిపెట్టేశారు. అయితే ఆన్ స్క్రీన్ లిప్ లాక్ అంటే అదో సరదా కాని ఆఫ్ స్క్రీన్ లో దాని ప్రభావం ఎలా ఉంటుందో కాస్త ఆలోచించాల్సిందే.

ఇండస్ట్రీలో అది కామన్ అని లైట్ తీసుకునే వారు చాలా మంది కాని దాన్ని బూతద్ధంలో పట్టి చూసేవారు ఉన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ఓ బాలీవుడ్ హీరో లిప్ లాక్ అతని కాపురంలో చిచ్చు పెట్టింది. ఒకటి రెండు కాదు మూడేళ్లు హీరోని వదిలి వెళ్లిందట అతని భార్య. బాలీవుడ్ లో ట్రెండీ హీరో ఆయుష్మాన్ ఖురానా 2012లో విక్కీ డోనార్ సినిమా చేశాడు.

సుజిత్ సర్కార్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో హీరోయిన్ యామి గౌతం తో ఘాడ ముద్దులు పెట్టాడు ఆయుష్మాన్. ఆ ముద్దుల వల్ల తన భార్య తహీరా కశ్యప్ హర్ట్ అయ్యిందట. అతనితో మూడేళ్లు దూరంగా ఉందట. ఎలాగోలా ఆ గొడవ సర్ధుమనిగింది అంటున్నాడు ఆయుష్మాన్. ఆ తర్వాత ఆమె కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తుందని ఈమధ్య వచ్చిన మన్మర్జియాన్ సినిమాలో భూమి ఫెడ్నేకర్ తో లిప్ లాక్ పై తన భార్య ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు అంటున్నాడు ఆయుష్మాన్. మొత్తానికి లిప్ లాక్ వల్ల హీరో అంతగా బాధపడ్డాడన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version