మాటేరాని మగువకు 13 అవార్డులు.. కష్టాలు తెలిస్తే షాక్..!!

-

కృషి , పట్టుదల, ప్రతిభ ఉంటే చాలు మాటలు రాకపోతే ఏమి అంటోంది ఒక అందమైన మగువ. అందం, అభినయం , చూపరులను ఆకట్టుకునే చిరునవ్వు.. ఇక ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈమె గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్య పోవటమే కాదు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే అభినయ పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టింది. చెప్పాలంటే ఆమె మూగ మాత్రమే కాదు చెవిటి కూడా. ఇలాంటి అంగవైకల్య లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అంటే నిజంగా ఒక పెద్ద సాహసం అని చెప్పవచ్చు. ఇక అలాంటిది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏకంగా అవార్డులను సైతం సొంతం చేసుకునే స్థాయికి ఎదిగింది అంటే ఆమె ఎంత ప్రతిభ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.Abhinaya in yet another challenging roleఅభినయ కు నటన తప్ప మరొక లోకం లేదు.. ఆమెకు వున్న సమస్యలు పోగొట్టాలని ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నం చేశారు. కష్టపడి 11 లక్షల రూపాయలు అప్పు చేసి మరి తమిళనాడు నుండి హైదరాబాదుకు వచ్చి స్పీచ్ థెరపీ కూడా చేయించారు. కానీ భగవంతుడు అభినయ పై తన దయ చూపించలేకపోయాడు. అందుకే తన ఏడవ తరగతి లోనే తన కెరీర్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టింది అభినయ. ఇక అయితే ఆ తర్వాత ఈమెకు అవకాశాలు రాకపోయే సరికి కొంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. సినిమాల్లో నటించాలంటే కష్టం కాబట్టి ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ అభినయ తండ్రి ఆమెతో కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి ప్రయత్నించి విజయం సాధించారు.Actress Abhinaya awesome poses-అభినయ మస్తీ ఫొటోస్

అలా యాడ్స్లో నటించి తన నటనను మెరుగుపరుచుకుంది అభినయ. ఇక ఫోటోలలో ఆమె నవ్వు చూసి ఆ అమ్మాయి భలే ఉంది అన్న వారు ఆమెకు మాటలు రావు అని తెలిసి ఎంతోమంది ముఖం చిట్లించారు. ఇదిలా ఉండగా నాదోదిగల్ అనే సినిమా కోసం ఒక ముంబై ఆక్టర్ ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆవిడకు తమిళ్ మాట్లాడడం కష్టం కావడంతో ఆ సినిమా తాను చేయలేనని వెళ్ళిపోయింది. దీంతో ఆ సినిమా డైరెక్టర్ కోప్పడి ఎలాగైనా సరే అసలు కమ్యూనికేషన్ తెలియని ఒక హీరోయిన్ ని తీసుకువచ్చి సినిమాలో నటింపజేయాలని అనుకున్నారు. దీంతో మాటేరాని అభినయను తీసుకొచ్చి వెండితెరకు పరిచయం చేయడం జరిగింది.Abhinaya Actress Family Husband Biography Parents children's Marriage Photos

ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఏకంగా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో శంభో శివ శంభో గా తెరకెక్కించడం జరిగింది. అంతే కాదు ఈ సినిమాలో కూడా రవితేజ చెల్లెలిగా నటించింది అభినయ. ఇదే సినిమాను కన్నడలో కూడా తెరకెక్కించారు. ఇకపోతే మాటలు రాని , వినపడని అమ్మాయి డైలాగు ఎలా చెప్పింది ..ఎలా నటించింది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. కానీ డైరెక్టర్ డైలాగ్స్ ను అభినయ కంటే ముందుగా ఆమె తల్లిదండ్రులకు చెప్పగా వారు తమ కూతురు కు సైగల ద్వారా చూపించేవారు. ఇక అలా సింగిల్ టేక్ లోనే అభినయ తన డైలాగ్ కి తగిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నటించేది. దమ్ము, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news