కరోనా కట్టడికి కిమ్‌ కీలక నిర్ణయం..

-

ఉత్తర కొరియాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. యావత్తు ప్రపంచం కరోనా వైరస్‌ ధాటికి బలైనా.. ఉత్తర కొరియాలో మాత్రం కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే.. ఇప్పుడు కరోనా వైరస్‌ ఉత్తర కొరియాలో సైతం వ్యాప్తి చెందుతుండడంతో.. అక్కడ ఇప్పటికే లాక్‌ డౌన్ విధించారు. అంతేకాకుండా హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌. అయితే.. తాజాగా కరోనా కట్టడికి కిమ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

 

నిన్న ఒక్కరోజే ఏకంగా 2.7 లక్షల మంది జ్వరం బారిన పడ్డ నేపత్యంలో.. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆ దేశం వద్ద పరీక్షల కిట్లు లేకపోవడంతో…North Korea media silent on Kim Jong Un's whereabouts | Kim Jong Un News | Al Jazeera ఈ జ్వరం కేసులన్నింటినీ కరోనా కేసులుగానే భావిస్తున్నారు. మరోవైపు ఆరుగురు చనిపోవడం ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో పరిస్థితిని కట్టడి చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించారు. మిలిటరీ ఆధ్వర్యంలో మందుల పంపిణీ చేపట్టారు. ప్రజలపై కఠినమైన ఆంక్షలను విధించారు. అలాగే, అధికారులపై కిమ్ జాంగ్ మండిపడ్డారు. జ్వరాల కేసులు అమాంతం పెరిగిపోతున్నా నియంత్రించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చేతకాని తనం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారిందని అన్నారు. సమయం జీవితంతో సమానమని… ఇకపై ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా వైరస్ కట్టడికి నడుం బిగించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news