బ‌న్నీకి చెల్లెలుగా ఐశ్వ‌ర్య రాజేశ్‌

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోకు చెల్లెలుగా కొత్త అమ్మాయిల‌ను తీసుకోవ‌డం చూశా, లేదా సైడ్ ఆర్టిస్టుల‌ను పెట్ట‌డం చూశాం. కానీ ఓ హీరోయిన్ హీరోకు చెల్లెలుగా ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. ఎందుకంటే ఆ హీరోయిన్ గ్రాఫ్ ప‌డిపోతుంది కాబ‌ట్టి. కానీ ఐకాన్ స్టార్ మూవీలో హీరోయిన్ గా ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టించ‌బోతోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పుష్ప‌లో ఆమె న‌టించ‌నుందంట‌.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కరోనా ఉన్న‌ప్ప‌టికీ జ‌న సంచారం లేని ఏరియాలో షూటింగ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. అంచ‌నాలు ఓ రేంజ్ లో పెంచేసింది. ఇక అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మండ‌న్నా నటిస్తోంది. హీరో చెల్లెలుగా మంచి ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర ఉందంట‌. న‌ట‌న‌కు మంచి క్రేజ్ ఉండ‌టంతో ఐశ్వ‌ర్య‌రాజేశ్ అయితేనే బాగుటుంద‌ని డైరెక్ట‌ర్ సుకుమార్ భావిస్తున్నారంట‌. ఆమె పాత్ర ఒక పోలీస్ అధికారితో ప్రేమ‌లో ప‌డే సీన్స్ ఉంటాయ‌ని స‌మాచారం. కాగా హీరో చెల్లెలు చ‌నిపోతుంద‌ని.. అందుకు హీరో ప్ర‌తీకారం తీర్చుకుంటాడ‌ని తెలుస్తోంది.