షాకింగ్ సర్వే : ఒక్క వ్యక్తి 406 మందికి కరోనా అంటిస్తాడట

-

కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తిని కట్టడి చేయడానికి సామాజిక దూరం మరియు మాస్కుల వాడకం తప్పనిసరి చర్యలు అని ప్రభుత్వం సోమవారం తెలిపింది. ఒక ప్రెస్ మీట్ ప్రసంగించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ ఈ విషయాన్ని వివరించడానికి కొన్ని సర్వేలను ఉదహరించారు. COVID-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తి సామాజిక దూర చర్యలను పాటించకపోతే, 30 రోజుల్లో ఆ వ్యక్తి ద్వారా 406 మందికి సోకుతుందని అనేక విశ్వవిద్యాలయాలు పరిశోధనలో తేలిందని ఆయన అన్నారు.

కరోనా-యువత
కరోనా-యువత

“కరోనా సోకిన వ్యక్తి బయటకు రాకుండా ఉండి 50 శాతం సోషల్ డిస్టెన్స్ పాటిస్తే, 406 కు బదులుగా 15 మందికి వ్యాధి సోకినట్లు కనుగొనబడింది. సోకిన వ్యక్తి 75 శాతం ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తే ఆ వ్యక్తి వలన కేవలం 2.5 మందికి కరోనా సోకవచ్చు అని “అగర్వాల్ చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వైపు క్లినికల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టడం అవసరమే అని, మరోవైపు కోవిడ్ -19 ను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి అని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news