ఆర్.ఆర్.ఆర్ మొదటి రోజు టార్గెట్ ఎంతో తెలుసా..!

-

రాజమౌళి మొదలు పెట్టిన మెగా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ పై అప్పుడే బాక్సాఫీస్ లెక్కలు మొదలయ్యాయి. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ మొదటి రోజు టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ్. రాజమౌళి, ఎన్.టి.ఆర్, చరణ్ ముగ్గురు కలిసి చేస్తున్న ఈ సినిమా మొదటి రోజు 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నారు.

వీకెండ్ లోనే 500 కోట్లు తెస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్.టి.ఆర్, చరణ్ స్టామినాలతో రాజమౌళి చేస్తున్న ఈ మూవీ 10వేల స్క్రీన్స్ తో ప్రపంచమంతా విడుదల అవుతుందని. కచ్చితంగా బాహుబలి రికార్డులను సైతం తిరగరాసేలా ఈ సినిమా వస్తుందని అన్నారు. ఇక ఎన్.టి.ఆర్, చరణ్ ల కన్నా రాజమౌళికి ఎక్కువ క్రేజ్ ఏర్పడిందని. ఆర్.ఆర్.ఆర్ తప్పకుండా అంచనాలను అందుకునే సినిమా అవుతుందని అన్నారు తమ్మారెడ్డి భరధ్వాజ్.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, కియరా అద్వాని సెలెక్ట్ అయినట్టు టాక్. మరి ఆర్.ఆర్.ఆర్ తమ్మారెడ్డి చెప్పిన ప్రిడిక్షన్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news