డైరెక్టర్ శంకర్ పరిస్థితి విషమం…?

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భారతీయుడు 2. ప్రస్తుతం 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ లో జరిగిన ఒక ప్రమాదం ఇప్పుడు సినీ పరిశ్రమను భయపెడుతోంది. షూటింగ్ లొకేషన్‌లో  బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.

స్పాట్ లో ఉన్న ఒక క్రేన్ విరిగి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సహాయ దర్శకులతో పాటుగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీనితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో దర్శకుడు శంకర్ కాలికి తీవ్ర గాయమైంది అంటున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ఆధారంగా చూస్తే శంకర్ కాలి తో పాటుగా ఇతర శరీరతభాగాలలో కూడా తీవ్రగాయాలు అయ్యాయి తెలుస్తోంది.

దీనితో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనలో మరో పది మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా షూటింగ్ ని విదేశాల్లో ప్లాన్ చేసిన తరుణంలో చెన్నైలో కొంత భాగం చిత్రీకరించే సమయాన ఈ ప్రమాదం జరిగింది.

భారతదేశంలో అత్యద్భుత దర్శకులలో ఒకరైన శంకర్‌ ప్రమాదం నుండి త్వరగా కోలుకోవాలని సినిమా
పరిశ్రమ, అభిమానులు కోరుకుంటున్నారు.