తెలంగాణ స్టార్ పై 50 కోట్లు పెడుతున్నారా?

-

మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న‌ డియ‌ర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కె.ఎస్ రామారావు సినిమా పూర్తిచేయ‌గానే మ‌ళ్లీ మైత్రీలోనే సినిమా చేయ‌నున్నాడు.

తెలంగాణ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప‌ట్టింద‌ల్లా బంగ‌ర‌మే అవుతుంది. ఏ సినిమా చేసినా హిట్ అనే ముద్ర‌ను ఇండ‌స్ర్టీలో బ‌లంగా నాటాడు. అందుకే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లంతా ఆ యంగ్ హీరో వెంట ప‌డుతున్నారు. విజ‌య్ డేట్లు ఇస్తే చాలా….రెండు, మూడేళ్లైనా ఆగుతామ‌ని విజయ్ ఇంటి ముందు క్యూ క‌డుతున్నారు. ఇండ‌స్ర్టీలో ఫేం ఉన్నం కాల‌మే దున్నుకోవ‌డం అన్న నానుడి ప‌ట్టిన విజ‌య్ కూడా అలాగే నిర్మాత‌ల్ని లాక్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌ని డేట్లు రెండళ్ల వ‌ర‌కూ ఖాళీ లేవు. రెండేళ్ల త‌ర్వాత సినిమా చేయాలంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చి టోకెన్ తీసుకుని క్యూలో ఉండాలి. అదీ ఇప్పుడు తెలంగాణ స్టార్ రేంజ్. ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ లో రెండు సినిమాలు, కె.ఎస్ రామారావు నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న‌ డియ‌ర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కె.ఎస్ రామారావు సినిమా పూర్తిచేయ‌గానే మ‌ళ్లీ మైత్రీలోనే సినిమా చేయ‌నున్నాడు. దీనికి త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమా కోసం అక్ష‌రాలా 50 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారుట‌. స్పోర్స్ట్ నేప‌థ్యంగల సినిమా కావ‌డంతో ఖ‌ర్చు విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఇంత బ‌డ్జెట్ పెడుతున్నారుట‌. కేవ‌లం రెండు బైక్ రేసింగ్ స‌న్నివేశాల‌కే 10 కోట్లు బ‌డ్జెట్ కేయ‌టాయించారుట‌.

ఫార్ములా వ‌న్ ట్రాక్, కొరియో గ్రాఫ‌ర్లు, ఖ‌రీదైన స్పోర్స్ట్ బైక్స్ ఇలా అన్నింటి ఖ‌ర్చు క‌లిపి 10 కోట్లు ఉంటుంద‌ని అంటున్నారు. గ‌తంలో విజ‌య్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు సాధించిన న‌మ్మ‌కంతోనే మైత్రీ ఇంత డేరింగ్ గా ముందుకు దిగుతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే డియ‌ర్ కామ్రేడ్ బ‌డ్జెట్ ను త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ముందు అనుకున్న బ‌డ్జెట్ క‌న్నా…క‌థ‌లో అంత విష‌యం లేక‌పోవ‌డంతో బ‌డ్జెట్ లో కోత వేసారు. ఈ విష‌యంలో నిర్మాణ సంస్థ‌కు-హీరోకి చిన్నపాటి డిస్ట‌బెన్సెస్ త‌లెత్తినా..చివ‌రికి సెట్రైట్ అయింద‌నుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version