అసలేంజరిగింది.. జానీ మాస్టర్ కు జైలు శిక్ష..

-

జానీ మాస్టర్ అనవసర వివాదాల్లో చిక్కుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా… ఇతర సినిమా ఇండస్ట్రీల్లోనూ ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు..

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు జైలు శిక్ష పడింది. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. రెండు డ్యాన్స్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో జానీ మాస్టర్ కు ఈ శిక్ష పడింది. మేడ్చల్ లోని ఎఎస్జే కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్… జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.

అసలేంజరిగిందంటే..

షేక్ జానీ బాషా(జానీ మాస్టర్) తన ఫ్రెండ్స్ తో కలిసి వేరే డ్యాన్స్ గ్రూప్ తో 2014 లో గొడవ పడ్డాడు. బాధితులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు విన్న కోర్టు.. జాని మాస్టర్ దే తప్పని తేల్చింది. ఆయనతో పాటు అతడి ఫ్రెండ్స్ ఐదుగురికి 6 నెలలు జైలు శిక్ష విధించింది. 1000 రూపాయలు జరిమానా విదించింది.

జానీ మాస్టర్ స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. 2009 లో ఆయన టాలీవుడ్ లో అడుగుపెట్టారు. చిరంజీవి, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకు ఆయన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version