వంద కోట్ల క్లబ్ లో చేరిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘ఆడు జీవితం’

-

మలయాళీ చిత్ర దర్శకుడు బ్లెస్సీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఆడు జీవితం’ – ద గోట్ లైఫ్. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుని.. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టింది. ఈ విషయాన్ని ఈరోజు చిత్రబృందం ప్రకటించింది. తమ చిత్ర బృందానికి అపూర్వ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ధన్యవాదాలు చెప్పారు. కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బెన్నీ డానియల్‌ (బెన్యామిన్) ‘గోట్ డేస్’ నవల రచించగా.. ఈ నవలను బ్లెస్సీ ‘ఆడు జీవితం’గా సినిమా రూపంలో తెరకెక్కించారు. దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి దీనిని తీర్చిదిద్దారు. రూ.82 కోట్లతో ఇది నిర్మితమైనట్లు అంచనా. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్‌ ఎంతో శ్రమించారు. కీలక సన్నివేశాల కోసం 31 కిలోల బరువు తగ్గారు.

Read more RELATED
Recommended to you

Latest news