వరుణ్ తేజ్ తో యాక్షన్ కింగ్

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన అంతరిక్షం అంచనాలను అందుకోకున్నా వెంకటేష్ తో కలిసి చేసిన ఎఫ్-2 మాత్రం సూపర్ హిట్ అందుకుంది. సంక్రాంతి పండుగ అసలు సిసలు హిట్టు బొమ్మగా ఎఫ్-2 వచ్చింది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా వెంకీ కామెడీ హైలెట్ కాగా వరుణ్ తేజ్ తెలంగాణా యాసలో అదరగొట్టాడు.

ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ జిగుర్తండా రీమేక్ లో నటిస్తున్నాడు. కిరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటుగా యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబితో పాటుగా వరుణ్ తేజ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాడట.

ఇప్పటికే తెలుగులో లై, నా పేరు సూర్య, అభిమన్యుడు సినిమాలతో అలరిచిన అర్జున్ సర్జా వరుణ్ తేజ్ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడో తెలియాల్సి ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబందించి పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news