స్త్రీలు మొబైల్స్ వల్ల చెడిపోతున్నారు : నటుడు భాగ్యరాజా సంచలన కామెంట్స్….!!

-

ప్రముఖ కోలీవుడ్ నటుడు మరియు దర్శకుడైన భాగ్యరాజా మన తెలుగు వారికి కూడా చాలా సుపరిచితం. తెలుగులో కూడా ఆయన తీసిన పలు సినిమాలు రీమేక్ కావడంతో పాటు మరికొన్ని డబ్బింగ్ చేయబడి విజయవంతం అయ్యాయి.ఇక నటుడిగా కూడా పలు సినిమాల్లో ఆకట్టుకునే నటనను కనబరిచి మంచి పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన భాగ్యరాజా, నేడు ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేడుకలో స్తీల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ‘కరుతుకలై పాతివు సీ’  అనే తమిళ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో మహిళలపై నేటి మాదిరిగిగా పెద్దగా అత్యాచార ఘటనలు జరిగేవి కావని,

 

వాస్తవానికి అప్పట్లో కట్టుదిట్టంగా రూల్స్  విధించడమే అందుకు కారణం అని ఆయన అని అన్నారు. కాగా రాను రాను రోజురోజుకు మన దేశం డిజిటల్ వైపు మళ్లడం, దానివలన సెల్ ఫోన్స్ వంటివి మన జీవితాల్లోకి ప్రవేశించచడం జరిగిందని, అయితే ఇవే ప్రస్తుతం ఆడవాళ్ళ జీవితాన్ని భగ్నం చేయడానికి కారణంగా నిలుస్తున్నాయని అన్నారు. ఎప్పుడైతే ఆడవాళ్లు సెల్ ఫోన్లను విరివిగా వినియోగించడం మొదలెట్టారో, అక్కడినుండి వారి జీవితాలే ఛిద్రం అవుతున్నాయని, వాటితో పాటు ఫోర్న్ సైట్ల ప్రభావం మరింతగా పెరగడంతో స్త్రీలపై అత్యాచారాలు, వేధింపులు మరింతగా పెరిగాయని, నిజానికి అవి పెరగడానికి స్త్రీలు సెల్ ఫోన్స్ వినియోగించడమే కారణం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

 

అంతటితో ఆగకుండా ఇటీవల తమిళనాడులో ఎంతో సంచలనం రేపిన పొల్లాచ్చి ఘటనలో మగవారి తప్పిదం కంటే వారిని ఉపయోగించుకున్న ఆడవారి తప్పే ఎక్కువ ఉందని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమిళనాట మహిళా సంఘాలు ఉవ్వెత్తున నిరసనలకు దిగాయి. నిజానికి తన సినిమాల్లో మహిళలకు గౌరవం ఇచ్చే పాత్రలు సృష్టించే భాగ్యరాజా, ఈ విధంగా నేడు మహిళలపై విమర్శలు చేయడం తగదని పలువురు సినిమా ఇండస్ట్రీ వారు సైతం ఆయనను తప్పు పడుతున్నారు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version