టాలీవుడ్ నటుడు మోహన్ కుటుంబంలో గత నాలుగు ఐదు రోజుల నుంచి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. న్యాయ సలహా అనంతరం FIRలో పోలీసుల సెక్షన్స్ మార్చిన విషయం తెలిసిందే. BNS 109 సెక్షన్ కింద మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు … మోహన్ బాబు అభ్యర్థనను నిరాకరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో మోహన్ బాబుకి బిగ్ ఝలక్ తగిలినట్టైంది. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయనను పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం తెలుస్తోంది.
ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో గత మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్‌కు వెళ్లారు మనోజ్. గేటుకు నెట్టుకుంటూ లోనికి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికీ తనపై దాడి జరిగిందంటూ మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు వచ్చి.. మీడియా ప్రతినిధుల ముందు తన బాధను వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మోహన్ బాబుతో మీడియా ప్రతినిధి రంజిత్.. “సర్.. చెప్పండి” అనగానే.. మోహన్ బాబు దుర్భాషలాడుతూ మైకు లాక్కొని విచక్షణారహితంగా దాడి చేశారు. ఇవాళ టీవీ9 మీడియాకు క్షమాపణ చెప్పారు మోహన్ బాబు.