ఆ డైరెక్టర్ తో నేచురల్ స్టార్ నాని సినిమా క్యాన్సిల్

-

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హాయ్ నాన్న సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నాని త్వరలోనే సరిపోదా శనివారం చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు.  ఈ ఏడాది ఆగస్ట్ 29వ తేదీన గ్రాండ్​గా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ తర్వాత నాని సాహో, ఓజీ ఫేమ్ సుజీత్​తో ఓ యాక్షన్ డ్రామా, బలగం ఫేమ్ వేణు యెల్దండితో ఓ ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు వేణుతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. కానీ అందుకు గల కారణాలు క్లారిటీగా తెలియలేదు. భవిష్యత్​లో మరో మంచి కథ దొరికితే వీరి కాంబినేషన్ కొనసాగే అవకాశం ఉందట. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారట. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news