నా కొడుకును, తేజ్ ను బైక్ రైడింగ్ లు వద్దని హెచ్చరించా..నరేష్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బైక్ రైడింగ్ లకు వెళ్ళొద్దని తన కొడుకును, తేజ్ ను హెచ్చరించా అని నరేష్ చెప్పారు. కానీ వినలేదన్నారు…దాంతో కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అనుకున్నా అని తెలిపారు. వీళ్ళందరికీ బైక్ క్లబ్ ఉందన్నారు. అందరికీ 1000 సిసి బైక్స్ ఉన్నాయి. మళ్ళీ బైకుల జోలికి వెళ్లకుండా ఒట్టు పెట్టించుకుంటామని నరేష్ చెప్పారు. పెళ్లి చేసుకొని కెరీర్ లో సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు అని నరేష్ అన్నారు.

ఇవన్నీ 1000 సిసి బైకులు..ఇలాంటి పవర్ ఫుల్ బైకులు ఇలాంటి రోడ్లపై వాడకూడదని చెప్పారు. నిన్న రాష్ డ్రైవింగ్ ఏం లేదని ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇక నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పలువురు యంగ్ హీరోలు నటుల కొడుకులు బైక్ రైడింగ్ లకు వెళతారని నరేష్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు.