ART Cinemas : మల్టీప్లెక్స్​ బిజినెస్​లోకి మాస్​ మహారాజ రవితేజ

-

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ తాజాగా మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్లో ఆయన పేరిట మల్టీప్లెక్స్లను ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఏషియన్ రవితేజ సినిమాస్ (ART Cinemas) అనే పేరుతో హైదరబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ థియేటర్ రన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రవితేజ కుమార్తె మోక్షద హాజరైంది. ఆమెను చూసిన అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక రవితేజ ఇటీవలే ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇక ఇప్పటికే టాలీవుడ్లో పలువురు హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్లో ఉన్న విషయం తెలిసిందే. మొదట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏఎంబీ (Asian Mahesh Babu) సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఏవీడీ (Asian Vijay Devarakonda Cinemas) పేరుతో మహబూబ్నగర్లో ఓ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో రవితేజ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news