విడాకుల రూమర్స్​పై గజిని బ్యూటీ అసిన్ సీరియస్

-

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది అసిన్. ఆ తర్వాత గజిని మూవీతో స్టార్​డమ్ సంపాదించుకుంది. శివమణి, ఘర్షణ వంటి చిత్రాలతో పాపులర్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు బాలీవుడ్​లోనూ పలు సినిమాల్లో నటించింది. ఆ తరుణంలోనే పారిశ్రామికవేత్త రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

తాజాగా అసిన్ తన భర్తతో దిగిన ఫొటోలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించడంతో విడాకులు తీసుకుంటున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్​పై అసిన్​ స్పందించింది. ‘సమ్మర్ హాలిడేస్​ ఎంజాయ్‌ చేస్తున్న తరుణంలో కొన్ని వార్తలు మాకు కనిపించాయి. వాటిని చూశాక, పెళ్లి కోసం ఇరు కుటుంబాలను, పెద్దలను ఒప్పించిన ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాం అంటూ వస్తోన్న వార్తలు నిరాధారమైన వార్తలు, ఇందులో ఎలాంటి నిజం లేదు. దయచేసి వార్తలు పబ్లిష్‌ చేసేటప్పుడు ఆలోచించండి. మా హాలీడేస్‌లో ఈ వార్తలకు సమయాన్ని కేటాయించినందుకు చింతిస్తున్నాం’ అని సోషల్‌ మీడియా వేదికగా తన స్పందనను పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news