మూడోసారి ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ జెనీలియా..!

-

జెనీలియా అనగానే ముందుగా బొమ్మరిల్లు సినిమా పేరు గుర్తుకొస్తుంది. హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ జెనీలియా ని ఎలివేట్ చేస్తూ సినిమాని తెరకెక్కించారు. ఇకపోతే బొమ్మరిల్లు సినిమాలో తన అంద చందాలతో పాటు నటనతో కూడా ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

Actress Genelia Deshmukh latest photos goes viral
Actress Genelia Deshmukh latest photos goes viral

టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి మరింతగా యువతను ఆకట్టుకుంది.అయితే..బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా మూడోసారి ప్రెగ్నెంట్ అయినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ భర్తతో కలిసి హాజరైన ఈమె బేబీ బంప్ తో కనిపించారు. దీంతో త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు రియాన్, రహ్యల్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కాగా, జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ లో వేద్ సినిమాతో పాటు ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్ లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news