టిడిపి అధినేత నారా చంద్రబాబుకు ప్రాణహాని ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తరపు లాయర్ సిద్ధార్థ లూత్ర. ఆయనను జైలులో ఉంచడం సరికాదన్నారు. ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నామన్న లూథ్ర.. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని తెలిపారు.
ట్రయల్ కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం తక్కువ అని.. హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేస్తామని తెలిపారు. గతంలో వెస్ట్ బెంగాల్ కి చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తామన్నారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని తెలిపారు. అయితే ఈ కేసులో చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని, తద్వారా మరిన్ని వివరాలు రాబట్టగలిగే అవకాశం ఉందని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరనుంది.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ను నిరసిస్తూ హైదరాబాదులో టిడిపి ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్ భవన్ ముందు బైఠాయించారు టిడిపి కార్యకర్తలు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.