రెడ్ డ్రెస్సులో యాపిల్ బ్యూటీలా జాన్వీ కపూర్ అందాల జాతర

-

జాన్వీ కపూర్.. మొన్నటిదాక బాలీవుడ్ లో మాత్రమే ఈ పేరు ఫేమస్. కానీ ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ కూ పాకింది. ఎన్టీఆర్ దేవర సినిమాతో ఈ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. మొదటి సినిమా షూటింగ్ జరుగుతుండగానే జాన్వీ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఈ భామ రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ బ్యూటీ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లతో జతకట్టినట్లే.

ఇక సోషల్ మీడియాలోనూ జాన్వీ హవా మామూలుగా ఉండదు. తరచూ ఫొటోషూట్లు చేస్తూ తన అందంతో కుర్రాళ్లకు చెమట పట్టిస్తూ ఉంటుంది. మత్తెక్కించే చూపులతో కైపెక్కించే పోజులు ఇస్తూ కుర్రాళ్ల గుండె ఝళ్లుమనిపిస్తుంది. తాజాగా జాన్వీ రెడ్ కలర్ డ్రెస్సులో సందడి చేసింది. ఈ ఔట్ ఫిట్ లో జాన్వీ అచ్చం యాపిల్ బ్యూటీలా కనిపిస్తోంది. క్లీవేజ్ షోతో ఈ బ్యూటీ కుర్రాళ్ల మతి చెడగొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news