Lavanya Tripathi: ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల రాక్ష‌సి!

-

Lavanya Tripathi: టాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచిన అందాల రాక్షసి లావ‌ణ్య త్రిపాఠి. త‌న అందం, అభిన‌యంతో మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్టేసింది ఈ అమ్మ డు. వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. అగ్ర కథనాయికగా దూసుకు పోయింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన వంటి చిత్రాల్లో న‌టించి.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సొట్ట బుగ్గల సుంద‌రి ఓ క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే.. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కూడా మ‌రో పాత్ర ఉంద‌ని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం న‌భా న‌టేష్ ను సెలెక్ట్ చేసిన‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. కానీ, స‌డెన్ గా తెర‌మీదకి లావ‌ణ్య త్రిపాటి పేరు తీసుక‌వ‌చ్చారు.

మ‌హేశ్ బాబు స‌ర‌స‌న హీరోయిన్‏గా న‌టించే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింద‌ని టాలీవుడ్ లో టాక్ వ‌స్తుంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి షూరు కానున్న‌ది. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు. తాజా సినిమాతో ఏవిధంగా అలరిస్తారో వేచి చూడాలి. ఇక‌ ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news