సుకుమార్ ప్లానే ప్లానబ్బా..!

-

స్టార్ డైరక్టర్ సుకుమార్ కేవలం డైరక్టర్ గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా బిజీ అవుతున్నాడు. కుమారి 21ఎఫ్ సినిమాతో నిర్మాతగా సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఆ తర్వాత దర్శకుడు సినిమా చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ప్రస్తుతం సుకుమార్ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా వస్తుంది. మైత్రి మూవీస్ బ్యానర్ తో పాటుగా సుకుమార్ ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలకు సుకుమార్ నిర్మతగా మారబోతున్నాడని తెలుస్తుంది. అందులో మెగా డాటర్ నిహారిక సినిమా ఒకటి ఉంటుందని తెలుస్తుంది. సుకుమార్ ఈ రకంగా తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరక్టర్స్ కు దర్శకులుగా మారే అవకాశాన్ని ఇస్తున్నాడు. అయితే వారికి ఛాన్స్ ఇవ్వడమే కాదు నిర్మాతగా సుకుమార్ కూడా బాగానే లాభపడుతున్నాడు. మరి డైరక్టర్ గా సక్సెస్ అయిన సుకుమార్ నిర్మాతగా ఎలాంటి హిట్లు కొడతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version