Samantha-Chaitanya Divorce: త‌ల్లి కావాల‌నుకున్న స‌మంత ఆశ‌ను చంపేశారు.. మాధ‌వీల‌త సంచ‌ల‌న కామెంట్స్

Samantha-Chaitanya Divorce: టాలీవుడ్ మోస్ట్ లవెబుల్ క‌పుల్స్అక్కినేని నాగ చైత‌న్య , స‌మంతలు. కానీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విడిపోయారు. కానీ వారి విడాకుల వెనుక కారణమేంటో అంతుచిక్కక ఫ్యాన్స్ అంతా అయోమయంలో ఉండిపోయారు. అస‌లు వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో.. ఎందుకు విడాకులు తీసుకుంటారో ఎవ్వ‌రికి తెలియ‌డం లేదు. అస‌లు కార‌ణాన్ని వారు బయటపెట్టకపోవడంతో.. రోజుకొక కథనం పుట్టుకొస్తోంది. అయితే నాగ చైతన్యకి కూల్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉండటంతో.. స‌మంత‌దే తప్పు అన్న‌ట్టు క్రియేట్ చేస్తున్నారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెట్టింట్లో. చాలా మంది అయిందేదో అయిపోయింది.

ఇక మీదట అయిన వారిని ప్రైవసీతో ఉండనిద్దామని అనేవారు కొంద‌రైతే.. ఏమాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టు ఎవ్వ‌డీకి న‌చ్చిన కామెంట్లు వాళ్లు చేస్తున్నారు. స‌మంత మాజీ ప్రియుడిని కూడా వ‌ద‌ల‌డం లేదు. ఈ వివాదంలోకి లాగేశారు. మ‌రికొంద‌రూ ఆమె పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ ఏమో నడుస్తుంద‌ని నీఛమైన కామెంట్లు పెడుతున్నారు. వారి ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫోటోలను వెతికి మరీ పొస్ట్ చేస్తున్నారు.

ఆ ఫోటోలను షేర్ చేస్తూ జుకల్కర్‌ను అందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె ధ‌రించే క్యాస్ట్యూమ్స్ మ‌రో కార‌ణంగా చూపిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. సమంత నాగ చైతన్యతో విడిపోవడానికి కార‌ణాలివేన‌ని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది.

స‌మంత ఎంతో మంచి అమ్మాయి. స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌లిసి ఎంతో మంది పసిబిడ్డల ప్రాణాలు కాపాడింది. ఆమె డబ్బు మనిషి కాదు. ఆమె కోట్లు సంపాదించినా.. కేవలం వేలల్లో పాకెట్ మనీ అడుక్కుని తీసుకుంటుంది. రూపాయి రూపాయి లెక్కలు చెప్పింది. పిల్లల్ని కని తల్లి అవ్వాలనుకున్న ఆమ ఆశను చంపేశారు. ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు సమంత అంటే ఏమిటో.. ఆమె ఎలాంటిదో.. తెలియ‌దు అని స‌న్సెష‌నల్ కామెంట్ చేసింది.

అందరూ సమంతని అనేవాళ్లే. ఎందుకంటే.. త‌నది పూర్ ఫ్యామిలీ కదా.. ప్రతి ఒక్కరి నోర్లూ లేస్తున్నాయి. సమంతకి ఉన్న మంచి మనసులో ఒక శాతం మ‌న‌సు మీకున్నా.. మీరు గొప్పవాళ్లు అవుతారు. ఆమె డబ్బులు సంపాదించే యంత్రంగానే చూశారు. అంటూ ఓ రేంజ్ లో కామెంట్ చేసింది.

సినిమా వాళ్లే.. కాదు సామాన్యుల జీవితాల్లో కూడా ర‌చ్చ‌బండాలు. బ‌తుకు జ‌ట్కా బండ్లు ఉన్నాయి. అనవ‌స‌రంగా నోరు పారేసుకోకండి. నాగార్జున కూడా విడాకులు తీసుకున్న వాడే.. అది వాళ్ల ప‌ర్స‌న‌ల్. ఎందుకంటే నాగార్జున మొదటి భార్య రామానాయుడు కూతురు కాబట్టి. అంత‌లో లోప‌ల జ‌రిగిపోయింది.

అయితే మాధవీలత షేర్ చేసిన పోస్ట్‌లో షాకింగ్ అంశాలు చాలానే ఉన్నాయి. సమంతను డబ్బుకోసం ఇబ్బంది పెట్టే అవ‌స‌రం నాగ్ ఫ్యామిలీకి ఏముంది? కోట్లు సంపాదించే సమంతకు వేల రూపాయల పాకెట్ మనీ కోసం.. ఆమె ఎందుకు చేయి చాచుతుంది? అంతా దీనమైన పరిస్థితిని అనుభవించిందా? స‌మంత తల్లి కావాలనుకుంటే ఆశల్నిచంపేశారు ఎవరు ? మాధ‌వీ ల‌త మాట్లాల్లో ఎంత నిజ‌ముంది?
ఇవి కేవ‌లం ఆరోపణలేనా అని తెలియ‌ల్సిఉంది.