మీరు జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చెయ్యడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నా వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 93 మెడికల్ ఆఫీసర్ ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే.. ఈ నోటిఫికేషన్ ద్వారా 93 పోస్టులని భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు చేసుకోనే అభ్యర్థుల గరిష్ట వయసు పోస్టుల ఆధారంగా వేరుగా ఉంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం అకాడమిక్ మెరిట్ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 10, 2021. కనుక ఆ లోగా అప్లై చేసుకోచ్చు. ఇక అర్హత విషయం లోకి వస్తే.. అభ్యర్థులు ఎంబీబీఎస్ చేసి ఉండాలి.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రర్ అయి ఉండాలి. దరఖాస్తుకు సంబంధించిన వివరాలు, నోటిఫికేషన్ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://rangareddy.telangana.gov.in/ ను సందర్శించాలి. దరఖాస్తుకు పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ సర్టిఫికెట్ మరియు పాస్ పోర్టు ఫోటోగ్రాఫ్ , ఈడబ్ల్యూఎస్ (EWS) వాళ్లు సర్టిఫికెట్ దరఖాస్తు చెయ్యడానికి అవసరం.