ఈ ఫొటోలో ఉన్న చిన్నది హీరోయిన్… గుర్తుపట్టండి చూద్దాం?

-

ఈ కింది ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్​. సుశాంత్​, రవితేజ సినిమాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలోనే అడివిశేష్​ సినిమాతో రానుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టగలరా?

టాలీవుడ్​ను ఎప్పటికప్పుడు కొత్త అందాలు పలకరిస్తూనే ఉంటాయి. తెలుగు చిత్రసీమ ఎప్పుడూ కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటది. అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అలా ఈ పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా కొంతకాలం క్రితం టాలీవుడ్​ను పలకరించిన హీరోయిన్​.

2018లో ఫెమినా మిస్ ఇండియా విన్నర్​గా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్​గా నిలిచింది. అలా అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్​గా చేసింది. సినిమా మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకున్నప్పటికీ ఈ అమ్మడు అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇంతకీ ఈమె మెరెవరో కాదు మీనాక్షి చౌదరి.

సుశాంత్​ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్​గా చేసిన ‘హిట్-2’ విడుదల కావాల్సి ఉంది. అడివి శేష్ హీరోగా చేసిన ఈ థ్రిల్లర్ చిత్రం.. త్వరలోనే థియేటర్లలోకి రానుంది. తమిళంలోనూ ‘కొలై’ సినిమా చేసింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాలు చేసేందుకు రెడీ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news