సెట్స్ లో రెచ్చిపోయిన ప్రగతి…చీరకట్టులో మాస్ స్టెప్పులు…!

టాలీవుడ్ లో అత్త తల్లి పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంతో పేరు సంపాదించడం తో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రగతికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో పాటు వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కుర్రాళ్ళు ప్రగతి అంటే పడి చచ్చిపోతారు.

కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రగతి సినిమా సెట్స్ లోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్స్ లో ప్రగతి హీరో నవీన్ చంద్ర ఇతర నటీనటులతో కలిసి మాస్ స్టెప్పులు వేసింది. బ్యాండ్ కొడుతుంటే ఉత్సాహంతో ప్రగతి రెచ్చిపోయింది. చీరకట్టులో ప్రగతి వేసిన స్టెప్పులు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దాంతో ఆమె అభిమానులు సూపర్ డూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.