హైదరాబాద్ లో మరో దారుణం : చేతులు, కాళ్ళు కట్టేసి యువతిపై కత్తితో దాడి

మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. ప్రేమ ఒప్పుకోలేదని, ఇతర కారణాలతో అన్యాయంగా మహిళలపై దాడులు చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అయితే తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో  చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగుల పల్లి లో యువతి పై యువకుడి హత్యాయత్నం చేశాడు. ఏకంగా యువతి ఇంటికి వచ్చి దాడికి చేయబోయాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు. యువతి చేతులు మరియు కాళ్ళు కట్టేసి మరీ.. దాడికి చేయబోయాడు ప్రేమ్ సింగ్. అయితే యువతి కేకలు వేయడం తో యువకుడి ని చితకబాదారు స్థానికులు.

అనంతరం దాడి చేసిన ప్రేమ్ సింగ్ ను పోలీస్ లకు అప్పగించారు స్థానికులు. యువతికి స్వల్ప గాయాలు కావడం తో… ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికుల దాడి లో గాయపడ్డ ప్రేమ్ సింగ్ ను కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తాగిన మైకంలో హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు పోలీసులు. అంతే కాదు ఇద్దరూ బంధువులుగా గుర్తించిన పోలీసులు..యువతి ప్రేమను అంగీకరించలేదని దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు