ఆ సినిమా చేసి తపుచేశా అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ …?

-

మన చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఎలాంటి స్టార్ డం సాధించుకుంటారో ఎప్పుడు ఎవరు ఒక్కసారిగా కిందకి జారిపడిపోతారో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా హీరోయిన్స్. మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ గా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటారు. ఒకవేళ ఫస్ట్ సినిమా గనక సూపర్ హిట్టయితే ఇక టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోను వరుసబెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొన్ని వరసగా బ్లాక్ బస్టర్స్ ని తమ ఖాతాలలో వేసుకుంటారు. రెమ్యూనరేషన్ కూడా కోట్లలో డిమాండ్ చేస్తారు. అయినా లక్కీ హీరోయిన్ అన్న టాగ్ తో మంచి రేంజ్ కి వెళతారు. అయితే ఎంత స్పీడ్ గా అయితే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంటారో అంతే ఫాస్ట్ గా డౌన్ ఫాల్ అవుతారు.

 

దాంతో కోలుకోలేకుండా ఫ్లాపుల మీద ఫ్లాపులు పడి దెబ్బ మీద దెబ్బ పడి చేతిలో ఒక్క అవకాశం లేకుండా పోతుంది. ఫ్లాప్స్ వరసగా క్యూ కట్టగానే అన్నీ చిత్ర పరిశ్రమల నుంచి డోర్స్ క్లోజ్ అయిపోతాయి. దాంతో డైలమాలో హీరోయిన్ గా ఒక్క అవాకాశం వచ్చినా చాలు అనుకుంటూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి సమయంలోనే కొన్ని తపులు చేసేస్తారు. అలాంటి తపే చేశానంటోంది. బ్యూటి ఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. దానికి తోడు పూజాహెగ్డే – రష్మిక లాంటి లక్కీ హీరోయిన్స్ ని తట్టుకొని రకుల్ నిలబడలేకపోతోంది.

 

అయితే రకుల్ కెరీర్ ఇలా అవడానికి కారణం తన స్వయంకృతాపరాధమే అంటున్నారు. అసలే అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జునతో కలిసి నటించిన ‘మన్మథుడు 2’ ఒప్పుకొని పెద్ద పొరపాటు చేసిందని అంటున్నారు. వాస్తవంగా ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో మళ్ళీ కెరీర్ ఫాం లోకి వస్తుందని ఊహించుకుంది. అందుకే లిప్ లాక్స్ ఉన్నా, బోల్డ్ గా నటించాల్సి ఉందని తెలిసినా కెరీర్ మీద ఆశ పడి ఒప్పుకుంది. కానీ అక్కడే రకుల్ రాంగ్ స్టెప్ వేసిందని ఇప్పుడు మదన పడుతుంది. అయితే ఇవన్ని మర్చిపోయి ప్రస్తుతం నితిన్ సరసన ఒక సినిమాలో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. మరి ఇప్పుడైనా ఈ బ్యూటికి హిట్ పడి మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version