విజయ్ సినిమాలో రెచ్చిపోయా.. రాశీఖన్నా బోల్డ్ కామెంట్స్ ..!

-

డియర్ కామ్రేడ్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటించారు. కాంత్రి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్రియోటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.వల్లభ నిర్మించారు. ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు సినిమా మీద భారీగా అంచానాలు నెలకొన్నాయి. డియర్ కామ్రెడ్ తో ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిన విజయ్ ఈ సినిమాతో మళ్ళీ షాటిసిఫై చేస్తాడనుకున్నారు. కాని ఈ సినిమా కూడా బాగా నిరాశపరచింది.

అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్ రాశీఖన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రాశీఖన్నా కాస్త బోల్డ్ గా నటించింది. క్యారెక్టర్ డిమాండ్ చేయడం ఒకెత్తైతే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ హీరో కావడం డైరెక్టర్ కి మంచి పేరుండటం..అలాగే పెద్ద నిర్మాణ సంస్థ కావడంతో బోల్డ్ గా నటించడానికి ఒప్పుకుంది. అయితే తాజాగా రాశీఖన్నా ఈ సినిమా మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో చేసినటువంటి పాత్రను ఇక మీదట చేయను అని వెల్లడించింది. దీనివల్ల నా కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడిందని తెలిపింది.

ఇక ప్రస్తుతం రాశీఖన్నా చేతిలో సినిమాలేవి లేవు. అయితే మారుతి దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరం తేజ్ నటించిన ప్రతీరోజు పండగే సినిమా హిట్ అందుకుంది. దాంతో రాశీఖన్నా తనకి మళ్ళీ అవకాశాలు వస్తాయని ధిమాగా ఉంది. ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version