యాంకర్ బుగ్గ గిల్లిన వేణు.. అందరూ షాక్

-

బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణలతో మరో చానెల్‌లో అదిరింది, లోకల్ గ్యాంగ్స్ అనే కొత్త షోలు ప్రారంభమయ్యాయి. జబర్దస్త్ డైరెక్టర్లైన నితిన్-భరత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షోలు మెల్లిమెల్లిగా జనాల్లోకి ఎక్కేస్తున్నాయి.

సీరియల్ నటి సమీరాను అదిరింది షోకు హోస్ట్‌గా తీసుకొచ్చారు. అయితే రష్మి, అనసూయ వంటి వారిని చూసిన వీక్షకులకు సమీరా అంతగా నచ్చలేదనుకుంటా. అందుకే ఆమె అంతగా దగ్గరకాలేకపోయింది. ఇక యూట్యూబ్ కామెంట్స్‌లో అయితే సమీరాను తీసేయండి మొర్రో అంటూ కామెంట్స్ పెట్టసాగారు. దీంతో యాజమాన్యం కూడా సమీరాను మార్చేసి.. ఆ స్థానంలో యాంకర్ రవి, బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీని తీసుకొచ్చారు.

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో… పంచ్‌లు బాగానే పేలాయి. అందులోనే వేణు చేసిన స్కిట్ మాత్రం బాగానే ఆకట్టుకునేలా ఉంది. హాయ్ సమీరా ఎలా ఉన్నావ్ అంటూ వేణు అనగా.. నేను సమీరాను కాదు భాను అంటుంది. వాయిస్ మార్చినంతా మాత్రానా నాకు తెలీదా అంటూ ఆమె బుగ్గను గిల్లేశాడు వేణు. ఈ ఘటనతో ఆమెతో పాటు అందరూ షాక్ అయ్యారు. మరి వీరిద్దరి యాంకరింగ్ అయినా వర్కౌట్ అవుతోందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news