ఆ జిల్లాలో ప్రతి రామాలయానికి ఆది పురుష్ స్పెషల్ గిఫ్ట్..!

-

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతగా నటించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆది పురుష్.. ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించగా ..ఇతర పాత్రల్లో స్టార్ కాస్ట్ మొత్తం సందడి చేశారు. ఇక ఆంజనేయ స్వామి పాత్రలో మలయాళం హీరో దేవదత్త నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే మొట్టమొదటిసారి ఈ సినిమా కోసం తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా వచ్చి ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి రాముడిగా కనిపించబోతున్నారు. అంతే కాదు ఈ సినిమా టికెట్లు కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి.

అంతేకాదు ఆది పురుష్ టీం ప్రతి సినిమా హాల్లో కూడా హనుమంతుడు రాక కోసం ఒక సీటును ఖాళీగా ఉంచ బోతున్నారట. ఎందుకంటే రామనామస్మరణ జరిగే ప్రతి చోటా కూడా హనుమంతుడు ఉంటాడన్న నినాదంతో ప్రతి థియేటర్లో కూడా ఆంజనేయుడు కోసం ఒకరి సీటును రిజర్వ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను పేదవారు కూడా చూడాలి అన్న ఆరాటంతో పేద పిల్లల కోసం బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ 10,000 టికెట్లకు పైగా బుక్ చేశారు. అలాగే రామ్ చరణ్ కూడా పేదవారి కోసం పదివేల టికెట్లు బుక్ చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మరొక కార్యక్రమంతో జనాలను ఆకట్టుకోపోతున్నారు చిత్ర బృందం.ఇకపోతే ఈ మంచి కార్యక్రమంలో శ్రేయాస్ మీడియా కూడా పాలు పంచుకోనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి కూడా 101 ఆది పురుష్ సినిమా టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత గండ్ర శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇకపోతే ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రాముడు కొలువై ఉండడం వల్ల ఆ జిల్లాకు మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news