తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ.. రాజేంద్రనగర్‌లోని న్యాయస్థానంలో శంషాబాద్ పోలీసులు…. కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ తరుణంలోనే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా.
అయితే.. తాజాగా అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల చేసింది. నా కుమారుడ్ని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడని… పెళ్లైన కొద్దిరోజులకే లగ్జరీగా బతకాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని వివరించింది కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి. జైలు నుండి బయటకు వచ్చాక కార్తిక్ మానసికంగా కృంగిపోయాడు.. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని వివరించింది కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి. నా కుమారుడి చావుకు అప్సర, తల్లి అరుణనే కారణం.. అప్పటి నుండి వాళ్లిద్దరు కనిపించలేదని పేర్కొంది.