‘ రూలర్ ‘ ఫస్ట్ సింగల్ వ‌చ్చేసింది … బాల‌య్య ఫ్యాన్స్‌కు ర‌చ్చ రంబోలానే..

నంద‌మూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ మూవీ రూలర్ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘యాక్షన్ హీరో…’ వచ్చేసింది. బాల‌య్య రెండు భిన్న మైన గెట‌ప్స్ ల‌లో క‌నిపిస్తోన్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. ఇక ముందే చెప్పిన‌ట్టు ఆదివారం సినిమాలో ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. బాల‌య్య మాస్ రోల్‌ను ఎలివేట్ చేసేలా ఈ సాంగ్‌లోని ప‌దాలు ఉన్నాయి.

సాంగ్‌లో లిరిక్స్ తో పాటు బాల‌య్య స్టైల్స్ కూడా అదిరిపోయాయ్‌. కార్పొరేట్ దిగ్గజంగా బాలయ్య లుక్ అండ్ స్టైల్ సూపర్ అని చెప్పాలి. బాల‌య్య రెండు పాత్ర‌ల్లో కార్పొరేట్ క్యారెక్ట‌ర్ ప‌క్క సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా క‌నిపిస్తోంది. ఇక చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందించిన ఈ పాట కంపోజింగ్ కొత్త‌గా లేక‌పోయినా బాల‌య్య‌కు మాత్రం ఇలాంటి త‌ర‌హా సాంగ్ కొత్తే.

బాల‌య్య గ‌త సినిమాల్లో ఉన్న సాంగ్స్‌కు భిన్నంగా ఈ సాంగ్ ఉంది. ఏదేమైనా రూల‌ర్ ఫ‌స్ట్ సాంగ్ బాల‌య్య ఊర‌మాస్ ఫ్యాన్స్‌కు మాత్రం పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. ఈ సినిమాలోనే బాల‌య్య‌ దేవా అనే మరో పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కిస్తుండగా, సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా ఈ నెల 20న ఈ సినిమా వ‌స్తోంది.