టాలీవుడ్ లో ‘మీటూ’ మూమెంట్.. సుమ, ఝాన్సీ రహస్య భేటీ..!

-

బాలీవుడ్, కోలీవుడ్ లో సెన్సేషనల్ గా మరైన మీటూ క్యాంపెయిన్ చిన్నగా టాలీవుడ్ బాట పట్టబోతుందని తెలుస్తుంది. అయితే దీనికి ముందస్తు చర్యలుగా ఇలాంటి వేధింపుల బాధితుల కోసం ప్రత్యేకమైన ప్యానెల్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా ప్రముఖ యాంకర్ సుమ, ఝాన్సీ సమక్షంలో ఓ మీటింగ్ జరిగిందట. ఇందులో లేడీ డైరక్టర్ నందిని రెడ్డి కూడా ముఖ్య పాత్ర పోశిస్తున్నారట.

బాలీవుడ్, కోలీవుడ్ లో లాగా కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ఈ ప్యానెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందట. పరిశ్రమలో ఎవరి వల్ల అయినా వేధింపులు వస్తే ఈ ప్యానెల్ కు తెలియచేయాల్సి ఉంటుందట. ఈ ప్యానెల్ కు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సపోర్ట్ కూడా ఉందని తెలుస్తుంది. అప్పట్లో శ్రీ రెడ్డి మొదలు పెట్టిన కాస్టింగ్ కౌచ్ కొందరి సపోర్ట్ వచ్చేలా చేసినా ఆమె ఆ ఉద్యమం పక్కదోవ పట్టించేసింది. ఇప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ డెశిషన్ తో తెలుగు పరిశ్రమలో మహిళలంతా ఒక్కటవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version